Wednesday, January 22, 2025

అదిరేటి డ్రెస్సు మేమేస్తే…

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట: లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఎవాల్వ్ పేరుతో నిర్వహించిన్న కిడ్స్ ఫ్యాషన్ షోలో చిన్నారులు అదరగొట్టారు. లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషేర్స్ డే పార్టీ 2023 స్టూడెంట్స్ స్టెప్పులతో అదరహో అనిపించారు. ఆత్మవిశ్వాసానికి ప్రతికల్లా మెరిసిపోయిన చిన్నారులు తమదైన బుడి బుడి నడకలతో ర్యాంప్ నకు అందాన్ని తెచ్చారు. ముద్దు లొలికే చిన్నారులు లకోటీయా ఇనిస్టిట్యూట్ ఫ్యాషన్ స్టూడెంట్స్ డిజైన్ చేసిన డ్రెస్సు లో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. చూడ ముచ్చటైన వస్త్రధారణలో తమదైన నడకతో చూపరులను కట్టిపడేశారు.

ఒకరు సంప్రదాయ పంచె కట్టుతో క్యాట్ వాక్ చేస్తే మరొకరు మోడ్రన్ డ్రెస్స్‌లో హొయలు ఒలకించారు. ఇలా రంగురంగుల దుస్తుల్లో చిన్నారులు ఆద్యంతం కనువిందు చేశారు. బంజారాహిల్స్‌లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషేర్స్ డే పార్టీ 2023 నిర్వహించిన ‘కిడ్స్ ఫ్యాషన్ షో తో చిన్నారులు, ఫ్రెషేర్స్ డే టి స్టూడెంట్స్ స్టెప్పులతో అదు ర్స్ అనిపించారు. ఆత్మవిశ్వాసానికి ప్రతికల్లా మెరిసిపోయిన చిన్నారు లు తమదైన నడకలతో ర్యాంప్ నకు అందాన్ని తెచ్చారు. బంజారాహి ల్స్‌లో జరిగిన కిడ్స్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. లకోటీయా ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ డిజైన్ బంజారాహిల్స్, అబిడ్స్ నిర్వహకులు అజహర్, అఫాన్, గుఫారన్, జాబీన్ వకీల్, రుషార్ రెహమాన్ పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News