- Advertisement -
భువనేశ్వర్: బాలుడి తల బారికేడ్ల మధ్య ఇరుక్కున్న సంఘటన ఒడిశా రాష్ట్రం పూరీలో జరిగింది. కలహండి జిల్లా భవానీ పట్నానికి చెందిన ఓ కుటుంబం పూరీలో జగన్నాథుడిని దర్శించుకుంది. అనంతరం చెప్పుల స్టాండ్ వద్దకు చెప్పులు తీసుకుంటుండగా బారీ కేడ్లో రెండు ఊచల మధ్య తల దూర్చాడు. దీంతో బాలుడు తల అందులో ఇరుక్కపోవడంతో ఏడ్వడం మొదలుపెట్టాడు. భక్తులు బాలుడిని లాగేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కట్టర్ సహాయంతో రెండు ఊచలను తొలగించడంతో బాలుడి తల అందులో నుంచి బయటకు వచ్చింది. బాలుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -