- Advertisement -
ఆంటిగ్వా: అంతర్జాతీయ క్రికెట్ లో ఆరు బాల్స్ లో 6 సిక్సర్లు నమోదయ్యాయి. కీరన్ పొలార్డ్ క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మూడవ క్రికెటర్‌గా నిలిచాడు. 2007లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్, టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు. ఈ ఫీట్ సాధించడంతో పొలార్డ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆరు బాల్స్.. ఆరు సిక్సులు కొట్టిన అనుభవం ఎలా ఉంటుందో తెలిసిన గిబ్స్, యువరాజ్ వెస్టిండీస్ ఆల్ రౌండర్ పొలార్డ్ అద్భుతమైన ఆట తీరును ట్విట్టర్ ద్వారా అభినందించారు. గత రాత్రి శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో పొలార్డ్ ఈ రికార్డ్ సృష్టించాడు. అకిలా దనంజయా వేసిన ఒక ఓవర్ లో ఆరు సిక్సులు బాది, తర్వాతి ఓవర్ లో ఔటయ్యాడు. పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ తో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ 13.1 ఓవర్లలో చేధించింది.
- Advertisement -