Saturday, November 23, 2024

అన్నం పెట్టినోళ్లకు అమెరికా సున్నం

- Advertisement -
- Advertisement -

kill list of Afghans who aided Americans

రెండు దశాబ్దాలుగా సాయం చేసిన అఫ్ఘన్ల జాబితా తాలిబన్లకు అందజేత
‘కిల్లర్ లిస్ట్’ చేతబట్టుకుని ఒక్కొక్కరిని వేటాడుతున్న తాలిబన్లు
బైడెన్ సర్కార్‌పై మండిపడుతున్న చట్ట సభ్యులు, మిలిటరీ అధికారులు

వాషింగ్టన్ : అప్ఘానిస్తాన్ లో రెండు దశాబ్దాలుగా తమకు సహాయం చేసిన అప్ఘాన్ ల పేర్లతో కూడిన ఓ జాబితాను అమెరికా స్వయంగా తాలిబన్ల చేతికి ఇచ్చినట్టు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా అధికారులు అందించిన ఈ జాబితాను తాలిబన్లు ‘కిల్ లిస్ట్’గా పరిగణించి ఒక్కొక్కరిని వెంటాడి వేటాడుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని కాబుల్ తాలిబన్ల వశమైన అనంతరం వారికి అమెరికా ఓ జాబితాను తాలిబన్లకు ఇచ్చిందని, అందులో అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లు, ఇన్నేళ్లు తమకు సహాయం చేసిన అప్ఘాన్ ప్రజల వివరాలు ఉన్నాయని న్యూయార్క్ పోస్టు అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ జాబితాను తాలిబన్లకు అందిస్తే, ప్రజల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని అగ్రరాజ్యం భావించింది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

ఇన్నేళ్లు అమెరికాకు సహాయం చేసిన అప్ఘాన్ లను వెంటాడి వేటాడుతున్నారు తాలిబన్లు. అందరినీ క్షమిస్తున్నామని బయటకు చెబుతూనే ఇళ్లు, కార్యాలయాలను తనిఖీ చేసి, ఇన్నేళ్లు తమకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన వారిని పట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు స్వయంగా అమెరికానే వెళ్లి తాలిబన్లకు జాబితా ఇవ్వడం గమనార్హం. అయితే ఈ జాబితా వ్యవహారాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించకపోవడం గమనార్హం. తనకు ఎలాంటి సమాచారం లేదని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు.అమెరికా నిర్ణయంపై ఆ దేశ చట్టసభ్యులు, మిలిటరీ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. జాబితాలో ఉన్న అప్ఘాన్ ల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమెరికా పౌరులకు.. ప్రమాదం తలపెట్టకూడదన్న అభిప్రాయంతోనే జాబితా తాలిబన్లకు ఇచ్చామని అమెరికా అధికారులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఇప్పటికే అప్ఘాన్ లను వేటాడి వెంటాడుతున్న తాలిబన్లు ఈ జాబితాలోని ప్రజలను ఏం చేస్తారనే ఆందోళన నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News