Thursday, January 23, 2025

‘రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రధాని మోడీని చంపండి’…

- Advertisement -
- Advertisement -

భోపాల్: “రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రధానిని చంపండి” అని కాంగ్రెస్ నాయకుడు రాజా పటేరియా అన్న వ్యాఖ్య దుమారం రేపుతోంది. అయితే ఆయన ‘ఇండియా టుడే’ తో మాట్లాడుతూ తన మాటలకు స్పష్టీకరణ ఇచ్చుకున్నారు. “ప్రధానిని చంపండి” అన్న నా మాటలకు అర్థం… వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించండి అన్న ఉద్దేశ్యంతో చెప్పిందన్నారు. “అది కూడా నేను ఫ్లోలో అనేసిన మాట. అయితే దానిని రికార్డు చేసిన వ్యక్తి సందర్భంలేకుండా వెల్లడించాడు” అని చెప్పుకొచ్చారు. అయితే ఆ వీడియోలో ఆ మధ్యప్రదేశ్ మంత్రి తన చుట్టూ ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అలా అన్నారు. “రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రధాని మోడీని చంపేయండి” అన్నట్లు ఆ వీడియోలో ఉంది.

ఇదిలావుండగా బిజెపి దీనిపై కాంగ్రెస్‌ను దుయ్యబట్టింది. ఆ పార్టీ మహాత్మా గాంధీ వంటి వారిది కాకుండా ముస్సోలిని వంటి వారికి చెందిందని విమర్శించింది. “పటేరియా ప్రకటనను నేనూ విన్నాను. అది కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ వంటి వారిది కాదని చెబుతోంది” అని మధ్యప్రదేశ్ బిజెపి నాయకుడు నరోత్తమ్ మిశ్రా తెలిపారు. “కాంగ్రెస్ పార్టీ ఇటలీకి చెందింది. ముస్సోలిని భావజాలాన్ని కలిగి ఉంది. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాల్సిందిగా నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌పి)కి ఆదేశం జారీ చేస్తున్నాను” అని కూడా నరోత్తమ్ మిశ్రా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News