Monday, December 23, 2024

తల్లితో సహా ఇద్దరు కూతుళ్ల ఆత్మ హత్య

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు తమ ఇంట్లో వేరు వేరు గదులో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం బోయిన్‌పల్లి పొలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నాగులంక కు చెందిన విజయ లక్ష్మి (55) ఇద్దరు కూతుర్లు చంద్ర కళ (30), చిన్న కూతురు సౌజన్య( 29) ప్రస్తుతం ఓల్ బోయిన్ పల్లి భవానీ నగర్ కాలనీ లో నివాసం ఉంటున్నారు. పెద్ద కూతురు చంద్రకళ ఎంబిఎ పూర్తి చేసి వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా, చిన్న కూతురు సౌజన్య వికలాంగురాలు కావడంతో ఇంట్లోనే ఉంటుంది.

విజయ లక్ష్మి భర్త గత ఏప్రిల్ నెలలో మరణించారు. దీంతో అప్పటి నుంచి మనస్తాపం గురైన ఈ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం తమ ఇంట్లోని గదిలోని సీలింగ్ ఫ్యాన్ లకు ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. తమ చావుకు ఎవరు కారణం కాదు అని మృతులు తమ సూసైడ్ నోట్లో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News