Monday, January 20, 2025

ఉత్తర కొరియా మిలిటరీకి కిమ్ జోంగ్ యున్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

సియోల్ ( ఉత్తర కొరియా) : దేశాన్ని ముట్టడించడానికి శత్రుదేశాలు సాగిస్తున్న కుట్రలను భగ్నం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ యున్ తన సైన్యాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికా ఉన్మాదంతో తమ మిత్రదేశాలతో కలిసి ఉత్తరకొరియా సమీపాన నౌకా విన్యాసాలు సాగిస్తోందని ఆరోపించారు. ఉత్తర కొరియా నేవీ డే సందర్భంగా సైనిక దళాలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అణుయుద్ధ ప్రమాదంతో కొరియా ద్వీపం సాగర జలాలు సుస్థిరంగా తయారయ్యాయని, ఎందుకంటే అమెరికా నేతృత్వంలో శత్రుత్వాలు వ్యూహాలు సాగించడమేనని హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఇటీవల సమావేశాలు నిర్వహించడాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News