Thursday, January 23, 2025

కవ్వించే శక్తులపై అణ్వాయుధాల పిడుగులే

- Advertisement -
- Advertisement -

Kim warns North Korea could 'preemptively' use nuclear

ఉత్తరకొరియా అధినేత కిమ్ హెచ్చరిక

సియోల్ : తమను కవ్విస్తే , బెదిరిస్తే తాము ఆత్మరక్షణకు అనివార్యంగా అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. తమంతతాముగా ముందు అణ్వాయుధాలను వాడే ప్రసక్తే లేదని, అయితే ఇతరుల నుంచి ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు వస్తే వీటిని తిప్పికొట్టేందుకు తమ మార్గాలు తమకు ఉన్నాయని, ఇందులో అణ్వాయుధాల ప్రయోగం కూడా కీలకం అవుతుందన్నారు. నిజానికి అంతం లేకుండా ఇతర శత్రుపక్షాలే అణ్వాయుధ ముప్పును తెచ్చిపెడుతున్నాయని, ఇటువంటి వాటిని తాము ఖచ్చితంగా దెబ్బతీసి తీరుతామని కిమ్ స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తర కొరియా సైనిక దళాల కవాతు జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరకొరియా వద్ద ఉన్న అత్యంత అధునాతన శక్తివంతమైన అణ్వాయుధాల బలాన్ని కూడా ప్రదర్శించారు.

తమ సైనిక పాటవశక్తిని కిమ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉత్తరకొరియా వద్ద ఖండాంతర అత్యంత శక్తివంతపు క్షిపణలు అణుపాటవంతో సంతరించుకుని ఉన్నాయి. ఇవి అత్యంత శక్తివంతంగా చివరికి అమెరికా నేలను గురిచూసుకుని దెబ్బతీసేంత సామర్థం సంతరించుకుని ఉన్నాయి. ఇక వాహనాలు, జలాంతర్గాముల నుంచి శత్రువుపై దాడి చేసే అల్ప దూరపు లక్ష ఛేదక క్షిపణులు అనేకం ఉత్తరకొరియా వద్ద ఉన్నాయి. వీటిని కూడా సైనిక కవాతులో ఉంచారు. కిమ్ ఇటీవలే అత్యున్నత స్థాయి సైనికాధికారులతో కలిశారని స్థానిక అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) తెలిపింది. అయితే ఈ సమావేశం ఏ తేదీన జరిగిందనేది రహస్యంగానే ఉంచింది. ఉత్తరకొరియా శక్తివంతపు అణ్వాయుధ పాటవం దక్షణ కొరియా, జపాన్‌లకు ముప్పును పెంచుతూ పోతోంది. ఉత్తర కొరియా సైన్యపు 90వ వార్షిక వ్యవస్థాక దినోత్సవం సందర్భంగా కిమ్ కవాతును ఉద్ధేశించి ప్రసంగించినట్లు వార్తా సంస్థ తెలిపింది. తమ దేశ అణుపాటవం ఎటువంటిదనేది అమెరికాకు తెలిపి తమ పట్ల వైఖరిని మార్చుకునే దిశలో ఆ దేశాన్ని దారికి తీసుకురావాలనే ఈ కవాతును కిమ్ అత్యద్భుతంగా వాడుకున్నట్లు స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News