Monday, December 23, 2024

జాంబియా నర్సుకు కిమ్స్ వైద్యుల ఆరుదైన చికిత్స

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాణాపాయ పరిస్ధితిలో నగరానికి వచ్చిన జాంబియా దేశానికి చెందిన నర్సుకు కిమ్స్ వైద్యులు సమగ్రంగా శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆమె సమస్యను, చేసిన చికిత్స వివరాలను ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా. పార్థసారథి వివరించారు. దక్షిణాప్రిక మధ్య దేశమైన జాంబియాలోని ఒక ఆసుపత్రిలోనర్సుగా చేస్తున్న 36 ఏళ్ల మహిళలకు ముగ్గురు పిల్లలున్నారు. కొంతకాలం ఆమె పనిచేసే ఆసుపత్రిలో హిస్టరెక్టమీ జరిగింది. ఆసమయంలో పొరపాటున గర్భసంచి తొలగించే క్రమంలో ప్రేగులకు గాయమైంది.

కొన్నాళ్ల తరువాత సమస్యలు రావడంతో మళ్లీ తెరిచి పేగులకు గాయానికి కుట్లు వేశారు. తరువాత మూత్రవిసర్జన మార్గం నుంచే మల విసర్జన కావడం లాంటి పలు రకాల సమస్యలు తలెత్తాయి. దీంతో కిమ్స్ ఆసుపత్రికి రాగానే ఆమెను ముందుగా ఐసీయూలో చేర్చాం. తొలుత ఒక శస్త్ర చికిత్సచేసి, పేగులకు అవసరమైన చోట కుట్లు వేసినట్లు తెలిపారు. అప్పటికే ఇన్ఫెక్షన్ తీవ్రంగా వ్యాప్తించడంతో కొంత మేర పేగులను కత్తిరించి తీసేయాల్సి వచ్చింది.

ఈశస్త్ర చికిత్సకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. ఇది చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స కావడంతో పదిరోజుల పాటు ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది. తరువాత మరో శస్త్రచికిత్స చేసి, మల విసర్జన సహజ పద్దతిలో జరిగేలా ఆమార్గాన్ని కూడా పునరుద్దరించినట్లు చెప్పారు. చికిత్స తరువాత ఆమె పరిస్థితి సాధారంగా మారిందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News