Sunday, January 19, 2025

వెయ్యి మూర్చ శస్త్రచికిత్సలు చేసి అసాధారణ రికార్డు సాధించిన కిమ్స్

- Advertisement -
- Advertisement -

Kims, who performed thousand epilepsy surgeries

హైదరాబాద్ : నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన కిమ్స్ దేశంలోనే తొలిసారిగా వెయ్యి మూర్చ శస్త్రచికిత్సలు చేసిన ప్రైవేటు ఆసుపత్రిగా అసాధారణ రికార్డు సాధించినట్లు ఆదివారం ప్రకటించింది. ప్రతి ఏటా ఫిబ్రవరి రెండో సోమవారం అంతర్జాతీయ మూర్చ దినంగా పాటిస్తారు. ఈసందర్భంగా అలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైస్సెప్ అండ్ టెక్నాలజీ మాత్రమే ఇప్పటివరకు వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు పూర్తి చేశాయి. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఈఘనత గురించి న్యూరాలజిస్టు డా. సీతాజయలక్ష్మి మాట్లాడుతూ మూర్చ ఉన్న రోగుల్లో దాదాపు మూడోంతు మందికి మందులతో నయం కాదు. దాని డ్రగ్స్ రెసిస్టెంట్ ఎపిలేప్సి అంటారు. ఇలాంటి వారిలో దాదాపు సగం మందికి శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.

శస్త్రచికిత్స చేసేముందు రోగులకు కాంప్రిహెన్సివ్ ఎపిలెప్సీ ప్రొగ్రాంలో నిశితంగా పరీక్షలు చేస్తాం. ముందుగా వారికి ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రాం రికార్డు చేసి, వాటిని ఎపిలెప్సీ మానిటరింగ్ ల్యాబోరేటరీలో పరిశీలిస్తాం. దీంతో మూర్చరకం, దాని కేంద్రం ఎక్కడో తెలుస్తుంది. ఇంకా 3 టిఎంఆర్‌ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు, ఎస్‌పీఈసీటి స్కాన్లను కలిపి వాడితే అప్పుడు శస్త్రచికిత్సతో ఫలితం ఉంటుందో లేదో తెలుస్తుందన్నారు. అదే విధంగా ఆసుపత్రి ఎండీ డా. బి. భాస్కర్‌రావు వివరిస్తూ మా ఆసుపత్రిలో దేశంలోనే అత్యుత్తమ న్యూరాలజీ బృందం ఉందని, వెయ్యి మూర్చ శస్త్రచికిత్సలు చేసి మొట్టమొదటి ఆసుపత్రి అవ్వడం ద్వారా కిమ్స్ ఆసుపత్రిలో ఫిజిషియన్లు, సర్జన్లు మరోసారి తాము మార్గదర్శులుగా ఉంటామని నిరూపించారని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News