Monday, December 23, 2024

అశోకస్తంభాన్ని చిత్రించిన కళాకారుడిని గుర్తించండి

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : భారత రాజ్యాంగం కోసం అశోకస్తంభం నమూనా నుంచి మూడు సింహాలను చిత్రించిన ఆనాటి కళాకారుడు దీనానాథ్ భార్గవను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తగిన విధంగా గుర్తించ వలసిన అవసరం ఉందని దీనానాధ్ భార్గవ కుమారుడు సౌమిత్ర భార్గవ విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ లోని బెతూల్‌లో ముల్తాయ్ కుటుంబం లో జన్మించిన దీనానాథ్ భార్గవ భారత రాజ్యాంగం కోసం సారనాథ్ లోని అశోకస్తంభం నుంచి మూడు సింహాల నమూనా తీసుకుని జాతీయ చిహ్నాన్ని కాపీ చేశారు. సత్యమేవ జయతే అన్న నినాదాన్ని చేర్చారు. అలాంటి కళాకారుడికి శాశ్వత గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ఆయన కుమారుడు సౌమిత్ర భార్గవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News