Wednesday, January 22, 2025

అమిత్‌షాను కలసిన మూసేవాలా తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

 Kin of late Punjabi singer Sidhu Moosewala meet Home Minister Amit Shah

 

చండీగఢ్: హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చండీగఢ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో తన కుమారుడి దారుణహత్యపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని మూసేవాలా తండ్రి బల్కూర్ సింగ్ అమమిత్ షాను కోరినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. శనివారం చండీగఢ్ వచ్చిన అమిత్ షా పంజాబ్ బిజెపి నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రారంభించడానికి హర్యానాలోని పంచ్‌కులకు బయల్దేరి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News