Sunday, February 2, 2025

‘యమ్మీ అప్రూవ్డ్ బై మమ్మీ’ కాంపైన్ ను ప్రారంభించిన కిండర్ క్రీమీ

- Advertisement -
- Advertisement -

పిల్లల స్నాక్స్ విషయంలో, అమ్మలకు ఎల్లప్పుడూ ఉత్తమంగా తెలుసు. నేటి అమ్మలు తమ పిల్లల ఉల్లాసకరమైన మనోస్థితిలో, తాము అందించే స్నాక్స్ పరిమాణం, నాణ్యతను నిర్థారించడంలో లీనమవుతారు. అలాంటి తెలివైన అమ్మదనం ప్రశంశిస్తూ, కిండర్ క్రీమీ, కిండర్ నుండి మినీ స్నాక్, తమ తాజా బ్రాండ్ ఫిల్మ్ కోసం నటీమణి సమీరా రెడ్డి మరియు ఇన్ ఫ్లూయెన్సర్ మీరా రాజ్ పుట్ కపూర్ తో అనుసంధానం చెందింది. ఆధునిక మరియు గర్వించే అమ్మదనం యొక్క ఆలోచనాత్మకమైన ఎంపికలతో ఉల్లాసకరమైన క్షణాల సారాంశాన్ని కాంపైన్ అందంగా కాప్చర్ చేసింది.

సమీరా మరియు మీరాల తమ అమ్మదనం శైలులు, ఆత్మవిశ్వాసం, సానుకూలత మరియు ఆధునికతతో సంప్రదాయాన్ని మిశ్రమం చేసే నైపుణ్యం విషయంలో ప్రసిద్ధి చెందారు. ఈ గొప్ప అమ్మలు తాజా ఫిల్మ్ లో కేంద్రంగా నిలిచారు, స్నాక్ టైమ్ వినోదం మరియు సంరక్షణ రెండిటిని ఏ విధంగా కలిగి ఉండవచ్చో చూపించారు, ప్రతి అమ్మ నేడు అనుసరించవలసిన సందేశం ఇది.

అమ్మ దగ్గర కూర్చుని ఉండగా చిన్నారి హోమ్ వర్క్ పూర్తి చేయడంతో ఫిల్మ్ ఆరంభమైంది. తదుపరి ఉల్లాసకరమైన ఊహించే ఆట ప్రారంభమైంది, దీనిలో రెండు వేళ్లల్లో ఒక వేలు ఎంచుకోవలసిందిగా చిన్నారి అమ్మను అడిగాడు: ఒక లూడో కోసం, రెండవది చెస్ కోసం. ఇంగ్లిషు మరియు హిందీ వెర్షన్స్ కోసం అమ్మ పాత్ర పోషించిన సమీరా మరియు మీరాలు చిన్నారి ఆనందం కోసం లూడో ఎంచుకున్నారు మరియు “చూడు, నేను ఎల్లప్పుడూ నీకు ఉత్తమమైనది ఎంచుకుంటాను” అని ఆత్మవిశ్వాసంతో అతనికి గుర్తు చేసారు. తదుపరి ఆమె తన చిన్నారి “యమ్మీ స్నాక్” లేదా “మమ్మీ స్నాక్” మధ్య ఎంచుకోవడానికి రెండు వేళ్లను చూపించిన ఉల్లాసకరమైన ఆటను కొనసాగించింది. చిన్నారి తెలివిగా “నేను రెండిటిని ఎందుకు ఎంచుకోకూ డదు” అని అన్నాడు.

సమీర మరియు మీరాలు తప్పకుండా అని అంగీకరించారు. తరువాత కిండర్ క్రీమీ వివిధ ఆకృతుల క్రీమీ, క్రంచీ మినీ స్నాక్ యొక్క వాగ్థానం చెప్పారు. మనస్సుకు హత్తుకునే విధంగా, అమ్మ కిండర్ క్రీమీని ఇవ్వడానికి తన చేతిని తెరిచింది, అది వినోదం మరియు పాల ఘన పదార్థాల సుగుణాలు, కోకో స్ప్రెడ్, బియ్యం పిండిల సరైన మిశ్రమం, తమ పిల్లల కోసం నేటి తల్లిదండ్రులు ఎంచుకునే స్నాక్ గా మలిచింది.

కొత్త కాంపాన్ విడుదల గురించి మాట్లాడుతూ, అమిడియో అరగోనా, రీజనల్ మార్కెటింగ్ హెడ్, కిండర్, ఫెరేరో ఇండియా ఇలా అన్నారు “మేము మామ్స్ (అమ్మలు) సమీరా రెడ్డి మరియు మీరా రాజ్ పుట్ కపూర్ లతో భాగస్వామం చెందినందుకు మరియు కిండర్ క్రీమీ సూచించే కుటుంబం మరియు వినోదాల యొక్క స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచినందుకు ఉల్లాసంగా ఉన్నాము. నేటి గర్వించదగిన తల్లిదండ్రుల జీవితాన్ని నిర్వచించే ఉల్లాసభరితమైన క్షణాలను సృష్టించాలని వారి అభిరుచి వారిని మా బ్రాండ్ కు ఉత్తమమైన సమర్థకులుగా చేస్తుంది. మా బ్రాండ్ కు వారు తీసుకువచ్చే వినియోగదారు సంబంధం భారతదేశంవ్యాప్తంగా కుటుంబాలతో కిండర్ క్రీమీ యొక్క బంధాన్ని వ్యాప్తి చేయడంలో మాకు సహాయపడుతుంది.”

కిండర్ క్రీమీ కేవలం మినీ-స్నాక్ మాత్రమే కాదు.ఇది నాణ్యతకు వాగ్ధానం, సుసంపన్నమైన పాల ఘన పదార్థాలతో, కరకరలాడే బియ్యం పిండితో తయారైంది. సరైన భాగాల సైజ్ లలో రూపొందించబడిన, ఇది ప్రతి బైట్ వినోదం మరియు సుగుణాలతో నిండి ఉండటాన్ని నిర్థారిస్తూనే ఆత్మవిశ్వాసంతో కూడిన స్నాక్-టైమ్ నిర్ణయాలు చేయడానికి తల్లిదండ్రులకు సాధికారత ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News