Sunday, December 22, 2024

ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ రాజు మూడవ చార్లెస్

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్ రాజు మూడవ చార్లెస్ పెరిగిన ప్రోస్టేట్ గ్రంధికి చికిత్స నిమిత్తం శుక్రవారం లండన్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. లండన్ క్లినిక్ ప్రైవేట్ ఆసుపత్రిల ఆయనకు శస్త్రచికిత్స జరగనున్నది. అదే ఆసుపత్రిలో వేల్స్ యువరాణి కేథరీన్‌కు క్రితం వారం సర్జరీ జరిగింది. 75 ఏళ్ల రాజు మూడవ చార్లెస్ తన చికిత్సకు ముందు శుక్రవారం ఆసుపత్రిలో వేల్స్ యువరాణిని సందర్శిఃచారు.

అయితే, మూడవ చార్లెస్ ఎంత కాలం ఆసుపత్రిలో ఉంటారో ఇంకా స్పష్టం కాలేదు. తమ ప్రోస్టేట్‌లకు వైద్య పరీక్షలు చేయించుకోవలసిందిగా ఇతరులకు ఒక సందేశం పంపుతూ రాజు మూడవ చార్లెస్ తన ఆరోగ్య సమస్యను అందరి దృష్టికి తీసుకువచ్చారు. ‘తన వైద్య పరీక్షల ఆరోగ్యంపై ప్రజలను జాగృతం చేస్తున్నందుకు రాజు ఆనందం వ్యక్తం చేశారు’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News