Wednesday, January 22, 2025

కింగ్ చార్లెస్ పుట్టిన రోజు వేడుకలు.. ఊరేగింపులో గుర్రపు స్వారీ

- Advertisement -
- Advertisement -

లండన్ :బ్రిటన్ చక్రవర్తి అయిన తరువాత కింగ్ ఛార్లెస్ అధికారిక పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 14 నాటికి చార్లెస్‌కు 74 ఏళ్లు వచ్చాయి. అయితే శనివారం రాజసంప్రదాయం ప్రకారం నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఊరేగింపులో ఆయన గుర్రపు స్వారీ చేశారు. 1400 మంది మిలిటరీ అధికారులు, 200 అశ్వాలు, 10 బ్యాండ్ మేళాలు, డ్రమ్స్ కు చెందిన 400 సంగీత కళాకారులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. చార్లెస్ గుర్రపు స్వారీని వీరంతా అనుసరించారు.

మాల్ మీదుగా సెంట్రల్ లండన్ లోని బర్కింగ్‌హామ్ ప్యాలెస్ వరకు సాగిన ఊరేగింపులో కింగ్ కుమారుడు, వారసుడు విలియమ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ , ఆయన సోదరి అన్నే యువరాజు, సోదరుడు ఎడ్వర్డ్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ తదితర రాజకుటుంబ ప్రముఖులు పాల్గొన్నారు. గుర్రాలతో కూడిన రథంలో కింగ్ భార్య రాణీ కెమిల్లా, విలియం భార్య కెథెరిన్, వేల్స్ యువరాణి, వారి ముగ్గురు పిల్లలు ప్రిన్స్ జార్జి, ప్రిన్సెస్ చార్లోట్టె, ప్రిన్స్ లూయిస్ ఉన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షత మూర్తి, ప్రత్యేక అతిధులుగా హాజరైన ఊరేగింపును సందర్శించారు. వీరితోపాటు మొత్తం 8000 మంది అతిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News