Tuesday, November 5, 2024

రాజు చార్లెస్ 3 కిరీటంలో మార్పు

- Advertisement -
- Advertisement -

సెయింట్ ఎడ్వర్డ్ కిరీటానికి బదులు ట్యూడర్ మకుటం
యుకె ప్రభుత్వం కొత్త మార్పులు

లండన్ : యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లో నూతన రాజరికం శకానికి ప్రతీకగా యుకె ప్రభుత్వం తమ దైనందిన వ్యవహారాలలో అన్ని విభాగాలలో ఉపయోగించే అధికారిక గవ్.యుకె డిజిటల్ సేవలలో లోగోను మార్చింది. రాజు మూడవ చార్లెస్ కిరీటాన్ని లోగోలో ప్రభుత్వం పొందుపరిచింది. 75 ఏళ్ల మూడవ చార్లెస్ 2022 సెప్టెంబర్‌లో సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఆయన తన రాజరిక చిహ్నంలో ట్యూడర్ కిరీటాన్ని ఉపయోగించాలని నిశ్చయించారు.

తన దివంగత మాతృమూర్తి రెండవ ఎలిజబెత్ ఉపయోగిస్తుండే సెయింట్ ఎడ్వర్డ్ కిరీటానికి బదులు ఆయన ట్యూడర్ కిరీటం ధరించాలని అనుకున్నారు. ట్యూడర్ కిరీటం డిజైన్‌ను మరింత వంపుగా కనిపించేలా మార్చారు. ‘రాజు సింహాసనం అధిష్ఠించిన దరిమిలా మేము ట్యూడర్ కిరీటం కొత్త డిజైన్‌ను ప్రతిబింబించేలా ప్రభుత్వ చిహ్నాలను తాజాగా మారుస్తున్నాం’ అని బ్రిటన్ ఉప ప్రధాని ఒలివర్ డౌడెన్ తెలియజేశారు. యుకె ప్రభుత్వ లోగోలో మార్పు ఈ వారం నుంచే జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News