Thursday, January 23, 2025

అట్టహాసంగా ఛార్లెస్-3 పట్టాభిషేకం

- Advertisement -
- Advertisement -

1300 సంవత్సరపు సింహాసన అధిరోహణం 
వంద మంది దేశాధినేతలు హాజరు
కోహినూర్ లేని కిరీటంతో రాణి
రింగ్ తొడిగి రాజు ప్రమాణం
దిక్కుల చుట్టూ ప్రదక్షిణాలు
లండన్: సందడే సందడిగా, కనుల పండువగా బ్రిటన్‌లో శనివారం కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం జరిగింది. వర్షంతో లండన్ తడుస్తున్న వేళ వెస్ట్‌మినిస్టర్ అబేలో జరిగిన రాజరిక మర్యాదల నడుమ ఛార్లెస్ రాజవంశ అధికార సంకేతం అయిన కిరీటాన్ని ధరించారు. తల్లి దివంగత క్వీన్ ఎలిజబెత్ రాజరిక వారసత్వాన్ని అధికారికంగా పొందారు. కిరీటధారుడై సింహాసనాన్ని అధిష్టించారు. బ్రిటిష్ సామ్రాజ్యపు వంశపారంపర్య తంతులో 70 ఏళ్ల తరువాత ఇప్పటి ఈ పట్టాభిషేకం జరిగింది. రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులు అయి ఉన్న ఛా ర్లెస్‌కు ఇప్పుడు కిరీటధారణ, తరువాత సింహాసన అధిరోహ ణం కీలక ఘట్టంగా మారింది.

ఈ వేడుకు రెండు వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. ఛార్లెస్ సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీట ధారణ జరిగింది. రాజుగా నియమితులు అయిన వారు కిరీటధారణ తో పట్టాభిషిక్తుడు కావడం బ్రిటన్ సామ్రాజ్య చరిత్రలో వేయి సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న ఆనవాయితీ. దీనిని పాటిస్తూ పలు సింహాసన అధిష్టాన ఘట్టాలను పాటిస్తూ ఛార్లెస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్ బగ్గీలో వేదిక వద్దకు
రాజనివాసం బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి కింగ్ ఛార్లెస్ దంపతులు సాంప్రదాయకపు బంగారపు తొడుగు ప్రత్యేక బగ్గీకి బ దులుగా ఆధునీకరించిన డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్ బగ్గీలో వెస్ట్‌మినిస్టర్ అబేకు అరుదెంచారు. వీరు అక్కడికి రాగానే కాంటెరెబరీ మతాధికారి అర్చ్‌బిషప్ జస్టిస్ వెల్బీ ముందుగా కింగ్ ఛా ర్లెస్‌ను సభికులకు పరిచయం చేశారు. ఇతనే మీ రాజు అని తెలిపారు.

దిక్కులకు ప్రణమిల్లుతూ ప్రదక్షిణలు
రాజ పట్టాభిషేక సంకేతంగా ముందుగా ఛార్లెస్ అన్ని వైపులా తాను కన్పించే విధంగా నాలుగు దిక్కులా ప్రదక్షిణ చేశారు. ఈ క్రమంలోనే ఆయనను పరిచయం జరిగింది. తరువాత చ ట్టాన్ని తాను కాపాడుతానని , దయతో న్యాయంతో పాలన సా గిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేశారు. తరువాత చర్చి ఆప్ ఇం గ్లాండ్‌కు విశ్వసనీయ క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్ రెండో ప్రమాణం చేశారు. దీని తరువాత సభికులు పెద్ద ఎత్తున భగవంతుడు రాజును రక్షించుగాక ( గాడ్ సేవ్ కింగ్ ) అంటూ నినదించారు. ప్రమాణం, ప్రార్థన ఘట్టాల తరువాత ఛార్లెస్ సింహాసనంపై ఆసీనులు అయ్యారు. 1300 సంత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన ఈ ప్రత్యేక పీఠం ఇప్పుడు ఛార్లెస్ 3 రాజరిక సింహాసనంగా కొనసాగింది. సింహాసనం కింది భాగంలో స్కాట్లాండ్ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచారు. తరువాత తెరవెనుకకు తీసుకువెళ్లి రాజును జెరూసలెం నుంచి తెప్పించిన పవిత్ర తైలంతో అభిషేకించారు. చేతులు, ఛాతీ, తలపై నూనె పోశారు. కొద్ది వ్యవధి తరువాత బంగారుతాపడపు మహారాజ గౌన్ వేసుకుని ఛార్లెస్ ఆసీనులు అయ్యారు. శిలువతో ఉన్న గోళాకారపు బంగారు రాజముద్ర, రాజదండాన్ని అర్చ్‌బిషప్ ఛార్లెస్‌కు అందించారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం ధ రింపచేసి, తరువాత కిరీటధారణ జరిగింది.

King Charles III Coronation

గాడ్ సేవ్ కింగ్ ని నాదాల తరువా ఛార్లెస్ తన రాజు హోదాతో సింహాసనం నుం చి లేచి రాజఖడ్డాన్ని చేతిలో పట్టుకుని తిరిగి పీఠంపై ఆసీనులు అయ్యారు. వెంటనే యువరాజు ప్రిన్స్ విలియం మోకాళ్లపై కూ ర్చుని రాజు కాళ్లకు చేయిని తాకించి కుడిచేతిని ముద్దాడారు. తరువాత రాణి కెమిల్లాపై పవిత్ర నూనెను చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేశారు. బంగారు ఉంగరం తొడిగింపు కార్యక్రమం పట్టాభిషేక దశలో అత్యంత కీలకం. రాజుకు తొడిగిన ఉంగరం సాక్షిగా రాజు ఈ ఉంగరం తోడుగా దీనిని వీర పవిత్రకంకణంగా భావించుకుని దేవుడి పట్ల అంకితభావం ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రజల సేవలో నిమగ్నం అయితీరా లి. దీనితోనే ఆయనపట్ల దేవుడి నుంచి నిరంతర ప్రక్రియగా రా జు పట్ల ఆదరణ, ప్రేమ వ్యక్తం అవుతుందని భావిస్తూ ఉంటారు.

ఒంటరిగా నవ్వుతూ కన్పించిన ప్రిన్స్ హ్యారీ
ఘనమైన ఈ పట్టాభిషేక కార్యక్రమానికి ప్రిన్స్ ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ ఒంటరిగా వచ్చారు. ఈ వేడుకలో తన సమీప బంధువులతో కలిసి నవ్వుతూ గడిపారు. రాచరికం తనకు వద్దని చెప్పిన హ్యారీ చాలా కాలంగా రాజకుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అమెరికాలో ఉన్న భార్య మేఘన్ మార్కెల్ ఆయన ఇద్దరు ఈ వేడుకకు రాలేదు. ఈ శనివారమే హ్యారీ కుమారుడు ఆర్కీ బర్త్‌డే కావడం విశేషం.

భిన్న మతవిశ్వాసాలకు పెద్ద పీట
ప్రమాణస్వీకారం తరువాత సభికులు బైబిల్ చదివారు. ముందుగా ఈ ఘట్టాన్ని దేశ తొలి హిందూ సంతతి ప్రధాని రిషిసునాక్ తాను స్వయంగా కొన్ని పంక్తులు చదివి ఆరంభించారు. రాజుకు పట్టాభిషేక సమయం రాజదంపతుల వివాహం దేవుడి దృష్టిలో వీరి పునర్వివివాహ తంతుగా భావించే తంతు ను తెలియచేస్తూ ఈ బైబిల్ పఠనం సాగింది. ప్రిన్స్ ఛార్లెస్, భార్య కెమిల్లా దంపతులు కూడా భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక బైబిల్ ఆలాపన ఘట్టంలో పాల్గొన్నారు. . హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూధ ప్రతినిధులు అబేలో కార్యక్రమానికి ముందు ప్రదర్శనగా వెళ్లారు. హౌస్ ఆఫ్ లార్డ్‌కు చెందిన భారతీయ సంతతి మతగురువులు కీలకమైన అపురూప కానుకలు అందించారు. బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి బయలుదేరిన బగ్గీ వెంబడి సైనిక సిబ్బంది కొందరు కాలినడకన రాగా తరువాతి క్రమంలో అశ్వికులు అనుసరించారు. సెంట్రల్ లండన్‌లోని వీధులన్ని వేలాది మంది రాజు శ్రేయోభిలాషులతో కిక్కిరిసి పొ య్యాయి. వారి చేతుల్లో పతాకాలు ఉన్నాయి. ఇవి రెపరెపలాడుతూ ఉన్న దశలోనే కొన్ని చోట్ల దేశంలో రాజరికాన్ని నిషేధించాలని కోరే వర్గం నిరసన జెండాలు కన్పించాయి. ట్రాఫల్గర్ స్కేర్ వద్ద నాట్‌మై కింగ్ పేరిట నిరసనకారులు కొంత కలవరాన్ని రేకెత్తించారు.

King Charles III Coronation

రాణి కెమిల్లాతో ఇప్పుడు అప్పట్లో క్వీన్ మేరీ ధరించిన కిరీటాన్ని ధరింపచేశారు. 1911లో జరిగిన అప్పటి ఈ ఘట్టంలో వాడిన కిరీటంలో ఉన్న పలు వజ్రాలు వైఢూర్యాలలో వివాదాస్పద కోహినూర్ వజ్రం కూడా ఉంది. తరువాత దీనిని కేవలం స్పటిక ప్రతిమ నమూనా ఉంటూ వచ్చింది. కెమిల్లా ఇప్పుడు కోహినూర్ వజ్రం లేకుండా ఉన్న కిరీటాన్ని ధరించారు. దీనికి బదులుగా వెండి బంగారపు తాపడాలు, 2200 వరకూ వజ్రాలు, వీటికి అత్యద్భుత కళాకృతులు , కొన్నింటికి గులాబీ పువ్వు ఆకారాలను పొందుపర్చారు. రెండు గంటల పాటు అబేలో పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. బకింగ్‌హాం ప్యాలెస్‌కు వచ్చిన తరువా దంపతులు రాజరిక మర్యాదలతో సైనిక వందనం పొందారు. బ్రిటన్, కొన్ని కామన్‌వెల్తు దేశాలకు చెందిన సాయుధ బలగాలు పరేడ్ నిర్వహించారు. ప్యాలెస్ ప్రఖ్యాత బాల్కనీ నుంచి నిలబడి రాజదంపతులు ప్రజల వైపు చిరునవ్వులతో కొద్దిసేపు ఉన్నారు.

భారతదేశం తరఫున ఉపరాష్ట్రపతి ధన్‌కర్
కింగ్ ఛార్లెస్ పట్టాభిషేక ఘట్టానికి భారతదేశం తరఫున ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ , ఆయన భార్య డాక్టర్ సుధేష్ ధన్‌కర్‌తో కలిసి హాజరయ్యారు. శుక్రవారం ఈ దంపతులు ఇక్కడికి వచ్చారు. అమెరికా నుంచి ఫస్ట్‌లేడీ, ఒబామా భార్య జిల్ ఒబామా వచ్చారు. ప్రెసిడెంట్ ఒబామా ఛార్లెస్‌కు శుక్షాకాంక్షలతో ట్వీటు వెలువరించారు. ప్రిన్స్ ఛార్లెస్ రాజరిక విశేష ఘట్టానికి దాదాపు 100 మంది వరకూ దేశాధినేతలు , ప్రభుత్వ ప్రతినిధులు వచ్చారుకామన్‌వెల్తు దేశాధినేతల వరుసలో ధన్‌కర్ కూర్చున్నారు. బ్రిటిష్ ఇండియన్ చెఫ్ మంజూ మల్హీకి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News