Monday, December 23, 2024

కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

లక్నో: కదులుతున్న కారులో ప్రభుత్య ఉద్యోగి కూతురుపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 22 ఏళ్ల యువతి పలుమార్లు టీ షాప్ యజమాని సత్యం మిశ్రా వద్దకు వచ్చేది. ఆమెకు మిశ్రాతో పరిచయడం ఉండడంతో అతడి వద్ద ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకునేంది. టీషాపు సమీపంలో అంబులెన్స్ ఉండడంతో ఆమె అందులో మొబైల్ ఫోన్ రిచార్జ్ పెట్టుకుంది. ఆమెను మిశ్రా తన కారులో బరాబంకీ ప్రాంతం సపేదాబాద్‌లోని దాబాకు తీసుకెళ్లాడు.

మిశ్రా స్నేహితులు అక్కడ ఉండడంతో కూల్ డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి ఆమెకు తాగించారు. ఆమె స్పృహ కోల్పోవడంతో కారు ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు. కొంచెం దూరంలో వెళ్లిన తరువాత కదులుతున్న కారులో ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఇందిరానగర్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు వాజరిగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపిసి సెక్షన్లు 376డి, 342, 328, 323, 506 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం కింగ్స్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులు సత్యం, సోహైల్, మహ్మద్ అస్లమ్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.19,830 నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News