Wednesday, April 16, 2025

కింగ్‌డమ్ నుంచి ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలను నెక్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అయితే ఈ సినిమాకు సంబంధించి విజయ్ దేవరకొండ తాజాగా ఓ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ చిత్ర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని..

ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందంటూ విజయ్ తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. దర్శకుడు గౌతమ్‌తో విజయ్ దీని గురించి చర్చిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశాడు. దీంతో ఈ సినిమాపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర వేరే లెవెల్‌లో ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News