- Advertisement -
తెలంగాణకు కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించలేదని యుబి పేర్కొందని, బీర్ల విక్రయాలు నిలిపివేస్తే ప్రీమియం బ్రాండ్లు కింగ్ ఫిషర్, హీనెకెన్‌కు అంతరాయం కలుగుతుందని, ఇది స్థానిక బ్రాండ్లు బూమ్ బూబ్ బీర్, బిర్యానీ బీర్ల ప్రోత్సాహానికి చేస్తున్న ప్రయత్నమా..?… బిల్లుల చెల్లింపులో ప్రత్యేక ప్రాధాన్యతల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా..? అని ప్రశ్నించారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా బిల్లులను క్లియర్ చేసేది అని గుర్తు చేశారు.
- Advertisement -