Tuesday, March 4, 2025

బాహుబలి, కాంతర తరహాలో ’కింగ్స్టన్’

- Advertisement -
- Advertisement -

సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా ’కింగ్స్టన్’. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకం మీద ఆయన ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా జీవి ప్రకాష్ కుమార్ తొలి చిత్రమిది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం మార్చి 7వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవి ప్రకాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో సముద్ర తీరం పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జాలరి పాత్ర చేశాను. సాధారణంగా జాలర్లు అందరూ సముద్రంలో వేటాడడానికి వెళతారు.

అయితే ఆ ఊరి ప్రజలు ఎవరూ సముద్రంలోకి వెళ్లరు. ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. అది ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. శాపాన్ని ఎదిరించాలని హీరో సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందనేది సినిమా. ఇండియాలో ఫస్ట్ సీ అడ్వెంచర్స్ థ్రిల్లర్ సినిమా ఇది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత హీరోకు జాంబీలు ఎదురవుతారు. అలాగే ఆత్మలు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు ఈ సినిమా విభిన్నమైన అనుభూతినిస్తుంది. ఇండియాలో ఇప్పటివరకు ఇటువంటి సినిమా రాలేదు. ‘బాహుబలి’ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. అలాగే ’కాంతార’ సినిమా ప్రేక్షకులను స్పిరిచువల్ వరల్డ్‌లోకి తీసుకు వెళ్లింది. మా ‘కింగ్స్టన్’ సినిమా కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్తుంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News