Thursday, March 6, 2025

‘కింగ్‌స్ట్టన్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నితిన్

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా ”కింగ్స్టన్‌” మూవీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో ‘బ్యాచిలర్’ తరువాత మరోసారి దివ్యభారతి, జీవీ ప్ర కాష్ జంటగా కనిపించబోతున్నారు. ఈ మూ వీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు జీవీ ప్రకాష్ కుమార్ తన సొంత బ్యానర్ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తమిళ, తెలుగు భాషల్లో మార్చి 7న రిలీజ్ చేయబోతున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘కింగ్స్టన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, మరో డైరెక్టర్ వెంకీ అట్లూరి, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ “కింగ్స్టన్’ ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఇలాంటి స్పెక్టాకులర్ విజువల్స్ అందించినందుకు డైరెక్టర్ కమల్ కు అభినందనలు. ట్రైలరే ఇలా ఉంటే, ఇంకా సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత పెరిగింది. నేను ఈ మూవీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”అని అన్నా రు. జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ “ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రెండు లవ్ పాటలు రిలీజ్ చేశాము.

త్వరలోనే ఒక అదిరిపోయే మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అది నా ఫేవరెట్. ’కింగ్స్టన్’ మూవీ ఒక బిగ్ డ్రీమ్. నిర్మాతగా ఇది నా ఫస్ట్ మూవీ. ’హ్యారీ పోటర్’ లాంటి మల్టీ యూనివర్స్ సినిమాలు చూసినప్పుడు డ్రీమ్ లోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సినిమాలను చూసి ప్రేరణ పొంది ఈ మూవీని తీశాను”అని తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “ఇలాంటి అద్భుతమైన మూవీని థియేటర్లలోనే చూడాలి. ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ దివ్యభారతితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News