Wednesday, January 22, 2025

చంద్రబాబు దూరదృష్టితోనే శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు

- Advertisement -
- Advertisement -

చంద్రబాబు దూరదృష్టితోనే శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని కేంద్ర మంత్రి కింజారపు రాంమ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు రాంమ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందన్నారు.

అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని ప్రతిపక్షాలు విమర్శలు చేశారని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్‌లో భాగంగా 10కే రన్ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News