Monday, November 18, 2024

సంక్షేమ బాటలో కిన్నెర పాట

- Advertisement -
- Advertisement -

Kinnera mogulaiah who meets Minister Gangula

మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసిన కిన్నెర మొగులయ్య

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు కళాకారులు వివరించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం మంత్రిని పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, బీమ్లానాయక్ ఫేమ్ కళాకారుడు దర్శనం మొగులయ్య కలిశారు. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో తన కళను చేర్చడం, ప్రభుత్వం తనకు అందిస్తున్న సహకారానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. గతంలో ప్రభుత్వం అందజేసిన ఉగాది పురస్కారంతో తన జీవితాన్ని మార్చిందన్నారు. కళాకారుల పింఛన్‌ను రూ.10వేల సహాయాన్ని తమ కుటుంబానికి కల్పించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పాటను పాడి ఆలపించారు కిన్నెర మొగులయ్య. కిన్నెర వాయిద్యాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వాయిద్యాలు తయారీ, కళాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వ సాయాన్ని ఆయన అర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కిన్నెర మొగులయ్యని శాలువాతో సన్మానించి, తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. కళాకారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా ఉన్నారని, ఉద్యోగాలు సైతం ఇచ్చారని, వారికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డిఎం రవీందర్, శంకర్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News