Thursday, January 23, 2025

చెడుగా ఆలోచించను

- Advertisement -
- Advertisement -

Aditi Rao Hydari shining in a sari

చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి గురించిన చర్చ ఈ నాటిది కాదు. సందర్భం వచ్చిన ప్రతిసారీ.. ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఇదే విషయమై బాలీవుడ్ నటి అదితిరావు హైదరీ మాట్లాడారు. నెపోటిజంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. “బంధుప్రీతి అనేది ఎక్కడ లేదో చెప్పాలి. ప్రపంచంలో ప్రతి చోటా నెపోటిజం ఉంది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి సులువుగా అవకాశాలు వస్తాయి. కానీ ఈ విషయంలో నాకు ఎవరిమీదా ఎలాంటి కోపము లేదు”అని అన్నారు. ఇక తన ఎదుగుదల గురించి ఆమె మాట్లాడుతూ “నేను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాను. నా ఎదుగుదల నా శక్తిని తెలియజేస్తుంది. నేను కలలు కంటాను.. వాటిని నెరవేర్చుకునేందుకు శ్రమిస్తాను. అంతే తప్ప ఇతరుల గురించి చెడుగా ఆలోచించను. నా ప్రతి నిర్ణయం నాకు శక్తినిస్తుంది. ఈ నిర్ణయాలు నిర్భయంగా ముందుకు సాగడానికి సహకరిస్తుంటాయి” అని పేర్కొంది అదితిరావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News