Monday, December 23, 2024

కొచ్చిపై హైదరాబాద్ గెలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) పోటీల్లో కిరాక్ హైదరాబాద్ టీమ్ మరో విజయం నమోదు చేసింది. గురువారం కొచ్చి కేడీస్‌తో జరిగిన పోరులో హైదరాబాద్ జయకేతనం ఎగుర వేసింది. అండర్ కార్డ్ విభాగంలో హైదరాబాద్ 21 తేడాతో కొచ్చిని కంగుతినిపించింది. 70 ప్లస్ కిలోల విభాగంలో హైదరాబాద్ రెజ్లర్ స్టీవ్ థా మస్, 55 కిలోల మహిళల విభాగంలో సవిత కుమారి విజయం సాధించారు. అయితే 100 ప్లస్ కిలోల విభాగంలో హైదరాబాద్ ఆటగాడు ఉజ్వల్ అగర్వాల్ ఓటమి పాలయ్యాడు. మెయిన్ కార్డ్ విభాగంలో హైదరాబాద్ రెజ్లర్లు జగదీశ్, అస్కల్ అలీలు జయకేతనం ఎగుర వేశారు. కిరాక్ హైదరాబాద్ తర్వాతి మ్యాచ్‌లో ముంబై మసల్స్‌తో తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News