Monday, January 20, 2025

హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఇంతకీ ఎవరా ప్రియురాలు అనుకుంటున్నారా.. తన మొదటి సినిమా రాజావారు రాణిగారులో నటించిన హీరోయిన్ రహస్యను పెళ్లి చేసుకోబుతున్నాడు కిరణ్. ఈ సినిమా సమయం నుంచే వీరి మద్య ప్రేమ చిగురించిందట.

Kiran Abbavaram to engaged Heroine Rahasya

అప్పటి నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ..పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కిరణ్ అధికారికంగా ప్రకటించారు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్యను పెళ్లిచేసుకోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. కాగా, ఫిబ్రవరి 17న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు సమాచారం.

Kiran Abbavaram to engaged Heroine Rahasya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News