Friday, November 22, 2024

ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్న నేపధ్యంలో మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన దర్శకులు గోపీచంద్ మలినేని గారికి, బుచ్చిబాబు గారికి కృతజ్ఞతలు. మీటర్ సినిమా హైవోల్టేజ్ తో స్టార్ అయ్యింది. ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన చెర్రీ గారికి కృతజ్ఞతలు. నవీన్ గారికి, రవిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్ట్ డైరెక్టర్ జేవీ, డీవోపీ దిలీప్, సాయి కార్తిక్ .. అందరికీ కృతజ్ఞతలు. సప్తగిరి ఎంతో సపోర్ట్ గా వున్నారు. అతుల్య చాలా బాగా పెర్ ఫార్మ్ చేసింది. రమేష్ నన్ను చాలా డిఫరెంట్ గా చూపించారు. మాస్ కమర్షియల్ ఆడియన్ కి ఎలాంటి ఎలిమెంట్స్ తో కథ కావాలో అవన్నీ ఇందులో ప్రజంట్ చేశారు. సినిమా అవుట్ అండ్ అవుట్ మీటర్ లో వుంటుంది.

సినిమా హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది. విజల్స్ కొట్టి గోల చేసి థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసే కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. సమ్మర్ కి మీరు ఆ ఎనర్జీ ఫీలౌతారు. థియేటర్ లో కూర్చున్నప్పుడు మీరు ఊహించిన దానికంటే ఎకువ ఎక్సయిట్ అవుతారు. నన్ను చాలా కొత్తగా చూస్తారు. సమ్మర్ లో అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. మంచి హాలీడే సీజన్. రవితేజ గారి సినిమా, మీటర్ రెండూ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు చూసి వీకెండ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీటర్ కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయని అనుకుంటున్నాను. మాస్ మీటర్ ఇది. మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న మీటర్ మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు

గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. క్రాక్ సినిమాకి రమేష్ నా దగ్గర అసోసియేట్ గా పని చేశాడు. ప్రతి దర్శకుడికి మంచి బ్యానర్ నుంచి రావాలని కల వుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, నవీన్ గారు రవి గారు చెర్రీ గారు వెనక వుండటం రమేష్ అదృష్టం. ట్రైలర్ టీజర్ మాస్ మీటర్ లో వున్నాయి. ఈ సినిమా రమేష్ కి మంచి డెబ్యు అవ్వాలని కోరుకుంటున్నాను. కిరణ్ కి యూనిక్ స్టయిల్ వుంది.

రవితేజ, నాని తర్వాత ఎలాంటి నేపధ్యం లేకుండా వచ్చిన హీరో తను. కిరణ్ ప్రధాన బలం డైలాగ్ డెలివరీ. అది చాలా నేచురల్ గా వుంటుంది. ఈ సినిమాతో తనకి మాస్ హిట్ రావాలని కోరుకుంటున్నాను. అత్యుల రవి మాస్ సినిమాకి సరిపడే హీరోయిన్. అందంగా వుంది. చక్కగా తెలుగు మాట్లాడుతోంది. సాయి కార్తిక్ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తనకి మంచి మాస్ పల్స్ వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 7 మీటర్ వస్తోంది. ఈ సమ్మర్ కి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్’’ అన్నారు

బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. చెర్రీ గారిది వందశాతం మాస్ మీటర్. ఈ సినిమా హిట్ అయి ఆయనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రమేష్ ని చూసినప్పుడు నాకు నేను గుర్తుకు వచ్చాను. ఆయన తపన పెద్ద విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. కిరణ్ కి పెద్ద ఫ్యాన్ భేస్ వుంది. ఈ సినిమాతో కిరణ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆడియన్స్ కూడా కమర్షియల్ మీటర్ లోనే వున్నారు. అందుకే ఈ మీటర్ అందరికీ కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను’’ అన్నారు

నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. నిన్ననే ఈ సినిమా చూశాను. చాలా బావుంది. మీటర్ ఈ సమ్మర్ లో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్. కిరణ్ ప్రతి సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. టీం అందరికీ గుడ్ లక్. అందరూ ఏప్రిల్ 7న థియేటర్ లో మీటర్ సినిమా చూడాలి’’ అని కోరారు.

నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి, బుచ్చిబాబుకి కృతజ్ఞతలు. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే నవీన్ గారు, రవి గారికి కృతజ్ఞతలు. మీటర్ సినిమాని రమేష్ అద్భుతంగా తీశారు. డీవోపీ వెంకట్, మ్యూజిక్ సాయి కార్తిక్, ఆర్ట్ డైరెక్టర్ జెవి..ఇలా అందరూ మంచి టీం వర్క్ తో పని చేశారు. మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. అదే అభిప్రాయాన్ని చూసిన ప్రేక్షకులు కూడా చెప్తారని నమ్మకంగా వున్నాం. కిరణ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. పాత్ర చాలా డైనమిక్ గా స్టయిలీష్ గా వుంటుంది. అతుల్య రవి, సప్తగిరి అందరూ చక్కగా చేశారు. ఏప్రిల్ 7 న అందరూ థియేటర్ లో మీటర్ చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు

అతుల్య రవి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పెద్ద బ్యానర్స్ లో లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. వారికి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. ఇంత పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. మీటర్ లో కిరణ్ మాస్ అవాతర్ చూస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న అందరూ థియేటర్ లో మీటర్ ఎంజాయ్ చేయండి’’ తెలిపారు

దర్శకుడు రమేష్ కడూరి మాట్లాడుతూ: నాకు ఇంత మంచి వేదికని ఇచ్చిన నిర్మాతలు రవి గారి, నవీన్ గారికి, చెర్రీ గారికి కృతజ్ఞతలు. మా గురువు గారు గోపీచంద్, బాబీ గారికి కృతజ్ఞతలు. వాళ్ళే లేకపోతే ఈ సినిమా లేదు. ‘మీటర్’ అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది. అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఇందులో వుంది. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఒక కుటుంబం భాద్యత తీసుకునే వ్యక్తి అందరికీ నచ్చుతాడు. ఇందులో హీరో కిరణ్ పాత్ర కూడా అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సమ్మర్ హీట్ ఎంత వుంటుందో మీటర్ కలెక్షన్స్ కూడా అంతే ఎక్కువ వుంటాయి. దిలీప్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, జెవి గారు మంచి సెట్స్ వేశారు. రైటర్ సూర్య మంచి డైలాగులు ఇచ్చాడు. కిరణ్ చాలా సింపుల్ గా వుండే వ్యక్తి. ఇందులో ఎప్పుడూ చూడని కిరణ్ ని చూస్తారు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ఎనర్జీ, ఎమోషన్స్ అందరినీ మెప్పిస్తాయి.అతుల్య రవి చాలా మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కార్తిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీటర్ సినిమాని సమ్మర్ కి కానుకగా ఇస్తున్నాం.ఫుల్ మీల్స్ లా వుంటుంది. మీరు పెట్టిన టికెట్ కి డబుల్ ట్రిపుల్ వస్తుందని గ్యారెంటీ ఇస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం’’ అన్నారు

సప్తగిరి మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం స్టామినా ఏమిటో చెప్పే సినిమా ఇది. ఏప్రిల్ 7 థియేటర్ థియేటర్స్ దద్దరిల్లి పోతుంది. చెర్రీ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. రమేష్ అద్భుతంగా తీశాడు. సినిమా కోసం కిరణ్ చాలా కష్టపడ్డాడు, దానికి తగ్గఫలితం దక్కుతుంది’’ అన్నారు

గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ పడిన కష్టానికి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. ఖచ్చితంగా అవుతుంది. రమేష్ అన్న ఎనర్జీ బావుంటుంది. చెర్రీగారి నిర్మాణం చేయడం ఎవరికైనా డ్రీం. మీటర్ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. డైలాగ్ రైటర్ సూర్య, వెంకట్ దిలీప్, జెవి, చిత్ర బృందం తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News