Friday, December 27, 2024

ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు

- Advertisement -
- Advertisement -

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే‘. చాందిని చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ఈ చిత్రం గీతా ఆర్ట్ ద్వారా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో జరిగిన సిని మా సక్సెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం, గోపీనాథ్ రెడ్డి, చాందిని చౌదరి, ప్రవీణ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… ‘సమ్మతమే’ సినిమాను చూసిన ప్రేక్షకులు మా కథే తీశారని, మా లైఫ్‌లో కూడా ఇలా జరిగిందని అభినందించడం ఆనందంగా వుంది. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ కథని ఎంత బలంగా నమ్మారో అంతే బలంగా తీశారు. యూత్‌తో పాటు కుటుంబమంతా కలసి సినిమాను ఎంజాయ్ చేశామని చెప్పడం హ్యాపీగా వుంది అని అన్నా రు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడు తూ… “సమ్మతమే’ అద్భుతమైన స్పందనతో పీపుల్స్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఆనందంగా వుంది. సినిమాకి మంచి స్పందన వస్తుందని ముందే అనుకున్నాను. నేను ఏదైతే నమ్మా నో అది నిజమైయింది” అని తెలిపారు. నిర్మాత ప్రవీణ రెడ్డి మాట్లాడుతూ… మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని ప్రేక్షకులు అందించాచారని పేర్కొన్నారు.

Kiran Abbavaram Speech at ‘Sammathame’ Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News