Monday, December 23, 2024

కలెక్టర్‌పై దాడి వెనుక బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు: ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దాడి చేసేలా స్థానికులను బిఆర్‌ఎస్ నేతలే ప్రోత్సహించారని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేకే కుట్రలు పనుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్‌పై దాడిని ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు బిఆర్‌ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్న కంపెనీలు తీసుకరావడానికి ప్రయత్నించడంతో పాటు భూసేకరణ చేస్తుందన్నారు. కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న ప్రభుత్వంపై దాడులు చేస్తే ఎలా అని ఎంపి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News