Tuesday, November 5, 2024

కాంగ్రెస్‌తోనే ఉమ్మడి ఎపి విడిపోయింది: కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: 1952 నుంచి మాది కాంగ్రెస్ కుటుంబమని, కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కిరణ్ కుమార్ బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పొరపాటు నిర్ణయంతో ఉమ్మడి ఎపి విడిపోయిందని, దీంతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని బాధను వ్యక్తం చేశారు. తప్పుడు నిర్ణయాలు వల్లే కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజన చేసిన తరువాత ఎపిలో కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుందని కిరణ్ కుమార్ దుయ్యబట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వ లేమితో ఇబ్బందులు పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News