Thursday, December 26, 2024

సిఎం చంద్రబాబుతో మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో మాజీ సీఎం కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ప్రస్తుత సీఎంతో మాజీ సీఎం భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా హోం మంత్రి అమిత్ షాతో సోమవారం భేటీ కానున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఇదే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News