న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉందని వెల్లడించింది. పార్లమెంటు సభ్యుడు భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. స్లాడింగ్ కమిటీ నివేదికలో చేసిన ప్రతిపాదనలు, సిఫార్సులను లా కమిషన్ పరిశీలిస్తోందని, ఒక ప్రణాళిక తయారు చేసే పనిలో నిమగ్నమైందని తెలిపారు. 2014-2022 మధ్య కాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఎనిమిదేళ్లలో రూ. 7000కోట్లకు పైగా ఖర్చయింది.
Law Commission of India 3 times recommended the establishment of regional branches of Supreme Court in East, West, North, South India. The matter was referred to Chief Justice of India. On 18th Feb 2010, SC in full court meeting decided not to consider the recommendation. pic.twitter.com/JlAa5bR0by
— Kiren Rijiju (@KirenRijiju) July 22, 2022