Wednesday, January 15, 2025

గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో…

- Advertisement -
- Advertisement -

హీరో త్రిగున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిరాయి’. సే క్రియేషన్స్, ఏఆర్‌కె ఆర్ట్ సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిలిమ్స్ పతాకంపై వి.ఆర్.కె. దర్శకత్వంలో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘కిరాయి‘ చిత్రంలోని రస్టిక్, రగ్గడ్‌గా ఉండే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు వి.ఆర్.కె. మాట్లాడుతూ “గుంటూరు, పల్నాడులో ఒకప్పుడు ఎక్కువగా హత్యలు జరిగేవి. దాని ఆధారంగా మేము గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తీస్తున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News