న్యాయ మంత్రి రిజిజూ శాఖ మార్పు
కొత్త న్యాయమంత్రిగా మేఘ్వాల్
ఆరోగ్య శాఖకు ప్రొఫెసర్ బఘేల్
కేంద్ర మంత్రి మండలిలో మార్పులు
కిరెణ్ ఇక భూ శాస్త్ర బాధ్యతలలో
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రిమండలిలో మార్పులు జరిగాయి. కొన్ని మంత్రిత్వశాఖలలో కదలికలు .జరిగాయి. కిరెణ్ రిజిజూను న్యాయమంత్రిత్వశాఖ నుంచి తొలిగించారు. ఆయన స్థానంలోకి ఇప్పటివరకూ పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్క్రతిక శాఖ ఇండిపెండెంట్ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను నియమించారు. కిరెణ్ రిజిజూ ఎర్త్‌సైన్సెస్ మంత్రిగా ఉంటారు. పలు ఇతర శాఖల బాధ్యతలతో ఉన్న జితేంద్ర సింగ్‌ను ఎర్త్ సైన్సెస్ నుంచి తప్పించారు. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రిగా ఉన్న ప్రొఫెసర్ ఎస్‌పి బఘేల్‌ను ఆరోగ్య మంత్రిత్వశాఖకు మార్చారు.
కేంద్ర న్యాయ, చట్ట వ్యవహారాల శాఖ నుంచి రిజిజూను తప్పించడం కీలక పరిణామం అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సలహా మేరకు ఈ మార్పులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతిభవన్ గురువారం ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. మేఘావల్ న్యాయశాఖను ఇండిపెండెంట్ మంత్రిగా నిర్వర్తిస్తారు. నిబంధనల ప్రకారం ఇండిపెండెంట్ హోదాలో మంత్రిత్వశాఖను నిర్వహించే వ్యక్తికి సహాయ మంత్రి ఉండరు. సహాయ మంత్రికి న్యాయశాఖను అప్పగించడం ఇదే తొలిసారి.
హోదాలో ఉన్న మంతిఇండిపెండెంట్ రిజిజూకు సుప్రీంకోర్టు కొలిజీయానికి, న్యాయవ్యవస్థకు మధ్య జడ్జిల నియామకాలు, ఎంపిక ప్రక్రియలపై తరచూ తారాస్థాయి వివాదాలు నెలకొన్నాయి. కొలీజియం అనేది అనవసరపు ఏర్పాటు అని ఓ సందర్భంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న రిజిజూ వ్యాఖ్యానించారు. ఇటువంటి పలు కీలక విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆయనను ఈ శాఖ నుంచి తప్పించి అప్రధానమే అయినా వినూత్న ఎర్త్‌సైన్స్‌కు మార్చారు.