న్యూఢిల్లీ: ఏడాది కిరెణ్ రిజిజూ ఏడాదిన్నర క్రితమే న్యాయశాఖ మంత్రి అయ్యారు. చురుగ్గా వ్యవహరించి, ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం తనక గర్వకారణం అని, తాను ఈ నేపథ్యంలో తాను పనిచేసిన మంత్రిత్వశాఖకు, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు, న్యాయమూర్తులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన రిజిజూ మూడుసార్లు లోక్‌సభ సభ్యులు అయ్యారు. తొలుత ఆయన కేంద్ర మంత్రి మండలిలో క్రీడల మంత్రిగా నియమితులు అయ్యారు. రవిశంకర్ ప్రసాద్ స్థానంలో 2021 జులై 7న న్యాయశాఖ మంత్రిగా నియుక్తులు అయ్యారు. న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని కిరెణ్ రిజిజూ చేసిన వ్యాఖ్యలపై బాంబే లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దిగింది. అయితే దీనిపై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కిరెణ్ రిజిజూ ఓ విఫల న్యాయమంత్రి అని కాంగ్రెస్ ఎంపి మాణికం ఠాగూర్ విమర్శించారు. ఇప్పుడు ఆయన భూ విజ్ఞాన శాఖ మంత్రిగా ఏం సాధిస్తారని ప్రశ్నించారు.