Saturday, January 4, 2025

తనిఖీలు… కానిసేబుళ్లపైకి దూసుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్లపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కృష్ణవరం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి సిఐ వైఆర్‌కె శ్రీనివాస్, ఎస్‌ఐ జి సతీష్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును కానిస్టేబుళ్లు ఆపారు. కారు రోడ్డు పక్కన ఆపినట్టుగా డ్రైవర్ నటించి ఒక్కసారిగా ఇద్దరు కానిసేబుళ్ల పైకి దూసుకెళ్లింది. కానిస్టేబుల్ లోవరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. రాజానగరం శివారులోని కెనాల్ రోడ్డులో కారును వదిలి డ్రైవర్ పారిపోయాడు. కారులో గంజాయి ఉందని, వాహనం ఉత్తర ప్రదేశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు పట్టుక్నుట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News