లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ లనూహ్యంగా రాజీనామా చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, కిర్‌స్టెనర్ మధ్య వచ్చిన విబేధాలే దీనికి కారణం. హెడ కోచ్‌గా పదవీ బాధ్యలు తీసుకొని ఆరెనెళ్లు గడవకముందే కిర్‌స్టెన్ పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చార్జ్‌తీసుకున్న కిర్‌స్టెన్.. పాక్ జట్టుకు మరో కోచ్‌గా వ్యవహరిస్తున్న జేసన్ గిలెస్పీ విభేదాలతోనే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా, కిర్‌స్టెన్ 2011లో భారత్‌కు హెడ్ కోచ్‌గా వ్యవరించాడు. నాయకత్వంలోనే భారత్ తొలిసారి టి20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. పాక్ హెడ్ కోచ్‌గా వెళ్లె ముందువరకూ ఐపిఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు ఆయన ప్రధాన కోచ్‌గా పనిచేశారు. కిర్‌స్టెన్ నాయకత్వంలోనే ఐపిఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ జట్టు టైటిల్ నెగ్గింది.
గిల్లెస్పీకి కీలక బాధ్యతలు..
కిర్‌స్టెన్ అనూహ్య నిర్ణయంతో తీసుకున్న రాజీనామాను ఆమోదించిన పాకిస్థాన్ క్రికెట బోర్డు వెంటనే కొత్త కోచ్‌ను నియమించింది. పాక్ టెస్టు జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న జెసన్ గిల్లెస్పీని ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. కిర్‌స్టన్ రాజీనామా చేసిన వెంటనే ఆయనకు వన్డే, టి20 జట్టు బాధ్యతలు కూడా అప్పగించింది పిసిబి. అయితే, ఈ బాధ్యత పేరుకు మాత్రమే ఉంది. ఎందుకంటే పాకిస్థాన్ జింబాబ్వే, ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత, అతని స్థానంలో మరొకరు ఈ పదవిని తీసుకోనున్నారంట. పాకిస్థాన్ జింబాబ్వే, ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్‌లను ఆడవలసి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌కు దొరకడం కష్టమే. అందుకే గిల్లెస్పీకి బాధ్యలు అప్పజెప్పినట్టు తెలుస్తోంది.