Monday, January 20, 2025

కేంద్రంపై మరో రైతాంగ పోరాటానికి సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మరో రైతాంగ పోరాటానికి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఉద్యమ కాలంలో రైతులపై బనాయించిన కేసులను ఎత్తివేస్తామని, మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని కిసాన్ మోర్చాతో ఒప్పందం చేసుకుని 9 నెలలు కావస్తున్నా రేతుల పై కేసులు ఎత్తివేయకుండా, ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించకపోగా దొడ్డిదారిన అమలు చేయాలనే మోది ప్రభుత్వంపై తిరిగి పోరాటం కొనసాగించాలని కిసాన్‌మోర్చ నిర్ణయించింది. రైతు వ్యతిరేక నల్లచట్టాలను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన మహత్తర రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్ బాడి సమావేశం మొదటిసారి దక్షిణాది ప్రాంతంలోని బెంగళూరులో జరిగింది. సుదీర్ఘకాలం సాగిన రైతాంగ పోరాటానికి తలొగ్గిన మోడి ప్రభుత్వం 2021 డిసెంబర్ 9వ తేదీన దేశ రైతాంగానికి బహిరంగ క్షమాపణలు చెప్పి బేషరతుగా మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని రైతుల పై బనాయించిన కేసులను ఎత్తివేస్తామని, మద్దతు ధరకు చట్టబద్దత కత్పిస్తామని ఒప్పందం చుసుకున్న విషయం తెలిసిందే.

హామీని నిలబెట్టుకోలేని కేంద్ర వైఖరికి నిరసనగా అక్టోబర్ నెలలో 3 కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఒకటి ఢిల్లీలో, రెండవది మధ్య భారత దేశంలో, మూడవది దక్షిణాది ప్రాంతంలో జరపాలని నిర్ణయించారు. ఎమ్‌ఎస్‌పికి చట్ట భద్రత కల్పించాలని, రైతులపై కేసులు ఎత్తివేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, డబ్లుటిఒ నుండి వైదొలగాలని, వ్యవసాయ ఉత్పత్తులపై, యంత్ర పరికరాలపై జిఎస్‌టి ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు శివకుమార్ కక్కాజీ, జగదీష్ సింగ్ గలైలీ, శాంతకుమార్, నల్లమల వెంకటేశ్వరరావు, దైవశిఘామని, అభిమన్య కోహర్, బిజూ లతో పాటు 18 రాష్ట్రాల నుండి 72 మంది రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News