Tuesday, December 24, 2024

డిసిసిబి డైరెక్టర్‌గా కిషన్‌రావు పవార్ నియామకం

- Advertisement -
- Advertisement -
  • ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి హరీశ్‌రావు

మొగుడంపల్లి/జహీరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్‌గా మాజీ జడ్‌పిటిసి కిషన్ రావు పవార్‌ను నియమించారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాన్ని హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కిషన్ రావు పవార్‌కు అందజేశారు. కిషన రావు పవార్ మాట్లాడుతూ తనపై నమ్మంతో డిసిసిబి డైరెక్టర్ గా ని యమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు ఈ పదవి వచ్చేందుకు కృషి చేసిన మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన ఎంపి బిబి పాటిల్, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు. మొగుడంపల్లి జడ్‌పిటిసి విజయ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News