Monday, December 23, 2024

రామగుండం సౌర విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణం

- Advertisement -
- Advertisement -

రామగుండం సౌర విద్యుత్ ప్రాజెక్టు
తెలంగాణకే గర్వకారణం
ప్రజలు సౌర విద్యుత్‌పై అవగాహన పెంచుకోవాలి
ఎన్టీపిసి 4,000 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రామగుండం ఎన్టీపిసి జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్మించడం తెలంగాణకు గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రధాని పలు రాష్ట్రాల విద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో కిషన్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ప్లాంట్ వల్ల 1.65 లక్షల టన్నుల బొగ్గు అదా అవుతుందన్నారు. వేల కోట్ల రూపాయల ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా రీనబులే ఎనర్జీ ప్రోత్సహించాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక పట్టణాన్ని బొగ్గు గనుల తవ్వకాల తీసుకున్నారని ఇది బాధాకరమన్నారు. 2,45,555 మెగా వాట్స్ విద్యుత్ అభివృద్ధి అయ్యిందని, 2014 తర్వాత 4 లక్షల మెగావాట్స్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రజలు సౌర విద్యుత్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామం నుంచి పట్టణం కార్యాలయం ఏదైనా కావచ్చు, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎక్కువ సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే మాములు కరెంట్ అంతగా డిమాండ్ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని తాము చెప్పలేదని కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా ప్రచరం చేస్తున్నాయన్నారు. ఎన్టీపిసి 4,000 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి కాబోతుందని ఆయన ప్రకటించారు. రామగుండంలో రాష్ట్ర రైతుల కొసం జై కిసాన్ బ్రాండ్ యూరియా కొనుగోలుపై సబ్సిడీ నిమిత్తం కేంద్రం ఒక బస్తా మీద రూ.3,000లను చెల్లిస్తుందన్నారు.

 

Kishan Reddy about Solar Project in Ramagundam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News