Monday, December 23, 2024

వడ్డీలూ చెల్లించలేని దుస్థితి: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వికసిత్ భారత్‌లో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను ఆవిష్కరించాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి చంద్రయాన్ వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ కేంద్రం ముందుకు సాగుతుందని తెలిపారు. గురువారం వాసవి బృందావన్ సభ్యుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబటి ఉందని అన్నారు. కానీ గత ప్రభుత్వం హైదరాబాద్ అంటే హైటెక్ సిటే అనే విధంగా వ్యవహరించిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ నగరంపై ఒక ప్రణాళికే లేదని విమర్శించారు. తాను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని, మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనను సంప్రదించవచ్చునని తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని అన్నారు. తనను గెలిపించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సమయంలో నైన మీ సమస్యలు తీర్చేందుకు, మీ సవాళ్ళను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని వి మర్శించారు. ఆ అప్పులకు మిత్తులు కూడా కట్టలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టి వేసి, గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయించిందని అన్నారు. కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌లకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నందున మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నాయన్నారు. డిఫెన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్, లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్ గా ఉందని తెలిపారు.

పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తు న మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలకు కృషి చేయాలని కోరారు. ఇన్ఫాస్ట్రక్చర్ డెవలెప్ చేయాలని, అప్పుడే ప్రజల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయని అన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి అవేం పట్టడం లే దని ఆరోపించారు. ఇన్ఫాస్ట్రక్చర్‌కి సంబంధించిన డెవలెప్‌మెంట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నగరం పెరుగుతుంది కాబట్టి ప్రజల మౌలికవసతుల ఏర్పాటుతో పాటు ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్ అయినప్పుడే రెండిటినీ బ్యాలెన్స్ చేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

అది బ్యాలన్స్ లేకపోతే ముందు ముందు పెట్టుబడులు రావని తెలిపారు. ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ త్వరలో మూడో స్థానానికి ఎగబాకనుందని ఆయ న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా మోదీ ప్రభు త్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి గెలిచాక మోదీ బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. దేశానికి ఈ రోజు బొగ్గు లైఫ్ లైన్ లాంటిదని, దేశంలో 85 శాతం పవర్ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News