Tuesday, November 5, 2024

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ కుటుంబం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రయివేటు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. గురువారం నాంపల్లిలో బిజెపి స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసుల విచారణలో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని తేలిందని వెల్లడించారు. దేశ భద్రతకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, సమాజంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రాజకీయాలకు సంబంధం లేని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడవుతోందన్నారు.

ఇది చాలా తీవ్రమైన అంశమని, ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో బిఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల సమయంలోనూ మా అభ్యర్థులు, నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కెసిఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బిఆర్‌ఎస్ అధినేతపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను మొదట ప్రొత్సాహించిందే బిఆర్‌ఎస్ అని అన్నారు. పార్టీలు మారే లీడర్లను కుక్కలు, నక్కలు అంటున్న కెసిఆర్ నాడు ఆ కుక్కలు, నక్కలను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నాడన్నారు. ఈ రెండు పార్టీలు ఒకటే అని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు అని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛను కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు హరించివేశాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారన్నారు. ఇది ఆషామాషీ కేసు కాదని, కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News