Thursday, January 2, 2025

మన్మోహన్ సింగ్‌ను కించపరచడం అవమానకరం… బండి, కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు క్షమాపణ చెప్పాలి
మనతెలంగాణ/హైదరాబాద్: భారత దేశఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మన్మోహన్ సింగ్‌ను కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఇది సిగ్గు చేటని, వారు క్షమాపణ చెప్పాలని పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆరోపించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఏమి జరిగిన తెలుసుకోవడానికి రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిందే మన్మోహన్ సింగ్ అని, పనికి ఆహార పథకం తెచ్చింది కూడా ఆయనేనని ఆయన అన్నారు.

తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చి తల్లిని చంపి బిడ్డను రేప్ చేసిండ్రు అన్న ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంపన్నులకోసం బిజెపి ఎంత ఆర్థిక విద్రోహనికి పాల్పడిందో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు సమాధానం చెప్పాలన్నారు. కాకినాడ కార్యవర్గ సమావేశంలో ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలు అని చెప్పి తెలంగాణను ఎందుకు ఇవ్వలేదో బిజెపి నేతలు చెప్పాలని, ఇప్పటికైనా మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News