Sunday, December 22, 2024

నామినేషన్లను దాఖలు చేసిన కిషన్ రెడ్డి, ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపి చీఫ్ జి. కిషన్ రెడ్డి, మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం లోక్ సభ ఎన్నికలకు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మే 13న వారి స్థానాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనన్నాయి. కిషన్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు బిజెపి సీనియర్ నాయకుడు రాజ్ నాథ్ సింగ్ ర్యాలీలో ప్రసంగించారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ సెగ్మెంట్ కు గాను రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.

ఇక మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేశాక, పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి హైదరాబాద్ సీట్ కోసం తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఆయన బిజెపి అభ్యర్థి మాధవి లతతో పోటీపడుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి తన నామినేషన్ ను మహబూబ్ నగర్ సెగ్మెంట్ కోసం దాఖలు చేయడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్యాలీలో ప్రసంగించారు.

Asaduddin Owaisi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News