Tuesday, December 31, 2024

ఆదుకుంటాం.. ఎస్‌డిఎఫ్ నిధులతోపాటు అదనంగా సాయం 

- Advertisement -
- Advertisement -

ఎస్‌డిఎఫ్ నిధులతోపాటు అదనంగా సాయం 
గత ప్రభుత్వం రూ.1348కోట్లు పక్కదారి పట్టించింది
బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి
ఖమ్మం జిల్లా పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
వరదబాధితులకు పరామర్శ, నిత్యావసర కిట్లు అందజేత
జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోండి : మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టంపై ఆయా రాష్ట్రాల నుంచి నివేదికలు రాగానే కేంద్ర ప్రభుత్వం సాయం చే స్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లాలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిలు ఈటల రాజేందర్, కొండా విశేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా ఖమ్మం నగర శివారులోని ధ్వంసలాపురంలో ము న్నేరు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఒక ఫం క్షన్ హాల్ లో బిజెపి తరఫున ఏర్పాటు చేసిన ని త్యావసర సరుకుల కిట్లను కేంద్ర మంత్రి వరద బా ధితులకు పంపిణీ చేశారు. ఆ తరువాత తిరుమలాయపాలెం మండలం, రాకాసి తండాను సందర్శించి దెబ్బతిన్న ఇండ్లు, పంటలను పరిశీలించా రు. బాధితులను పరామర్శించి మనోధైర్యాన్ని క ల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో వరదల వల్ల భారీగా నష్టం జరిగిందని అన్నారు.

సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవడానికి కలిసికట్టుగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జరిగిన వరద నష్టం గురించి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి గాని ఇటూ తెలంగాణ నుంచి గాని కేంద్రానికి ఇంకా నివేదికలు అందలేదని, నివేదికలు వచ్చిన వెంటనే కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. విపత్తులు వచ్చిన సమయంలో కేంద్రం నిధులు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉంటాయని, కేంద్రంలో కాంగ్రెస్ హయాంలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించారని ఆ ఫార్మెట్ ప్రకారమే కేం ద్రం నిధులను ఇచ్చి ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం 75 శాతం నిధులు ఇస్తే,రాష్ట్రం 25 శాతం నిధులను కలిపి జమ చేస్తుందని, ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడానికి కూడా అవకాశం ఉండదన్నా రు.

పకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాపకుండా ఉండేందుకు స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి ఎస్‌డిఎఫ్ నిధులను రా ష్ట్రా ల వద్ద ఉంచుతారని ఆయన చెప్పా రు. ఈ ని ధులను వాడుకున్న తరువాత దానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యు. సి) లను కేంద్రానికి పంపిస్తే మళ్ళీ నిధులను మంజూరు చేస్తారని అన్నారు. కానీ తెలంగాణలో గత ప్రభుత్వం దీనికి సంబంధించిన రూ.1348 కోట్ల నిధులను నిధులను పక్కదారి మళ్లించి, కనీసం యుసి సరిఫికెట్లను పంపకపోవడం వల్ల కేంద్రం నుంచి రూ. 200 కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోయాయయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయంపై తాను కేం ద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడి ఆ నిధులను తిరిగి కేటాయించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఎపికి అధిక నిధులు ఇచ్చి తెలంగాణకు తక్కువ నిధులు ఇచ్చారని వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి స్పందిస్తూ అసలు ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం నిధులు మంజూరు చేయలేదని, ఆయా రాష్ట్రాల నుంచి ఇంకా నివేదికలే కేంద్రానికి అందలేదన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రూ.3 వేల కోట్లు, తెలంగాణలో రూ.1300 కోట్ల ఎస్‌డిఎఫ్ నిధులు రిజర్వుగా ఉన్నాయని, ముందు వాటిని ఖర్చు చేయాల్సిందిగా ఆదేశించామని అన్నారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టంపై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ ను కూడా ఇక్కడికి పంపించారని అన్నారు. త్వరలో కేంద్ర అధికారుల బృందం కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తుందనిన్నారు.

తెలంగాణలో వరద నష్టం రూ.5438 కోట్లు ః పొంగులేటి
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల వల్ల రాష్ట్రంలో రూ.5438 కోట్ల నష్టం వాటిల్లిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్డి తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కేంద్రానికి పంపించారని అన్నారు. తెలంగాణలో జరిగిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాలని కోరారు.
గతంలో పిఎం తెలంగాణలో పర్యటించిన నందర్బంగా మఖ్యమంత్రి రేవంత్ మోడీని భడేబాయ్ అనేందుకే ప్రతిపక్ష పార్టీ రాజకీయ రంగు పులిమిందని, ప్రజలను ఆదుకోవడానికి, ప్రజల పక్షాన పోరాడాలనే ఉద్దేశం లేకుండా ప్రతి అం శాన్ని రాజకీయం చేసి లబ్ధ్ది పొందాలని వి పక్షం భావిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రేమంద్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, దేవకి వాసుదేవరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News