Monday, March 10, 2025

క్రికెట్ అభిమానులపై లాఠీచార్జ్…. కిషన్ రెడ్డి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రికెట్ అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్‌ చేయడం మంచిది కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. క్రికెట్ అభిమానుల ర్యాలీని అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టిమిండియా విజయం సాధించడంతో భారత జట్టుకు మద్దతుగా క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం దారుణమని దుయ్యబట్టారు. విజయోత్సవాలను అనుమతించకపోవడం సరికాదని చురకలంటించారు. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో భారతీయులు సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News