Wednesday, January 22, 2025

ఓరుగంటి రాములు మృతిపై కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిజెపి ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఓరుగంటి రాములు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ సీనియర్ నాయకుడిగా రాములు ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడి జైలుకు వెళ్లిన వ్యక్తి. జాతీయ భావాలు, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కార్యకర్తలను తయారు చేసిన వ్యక్తి అని గుర్తుచేశారు. రాములు ఆకస్మిక మరణం పార్టీకి, జిల్లా ప్రజలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News