Wednesday, January 22, 2025

పరేడ్ మైదానం నుంచి పరకాల వరకు… ఏకబిగిన బైక్ ర్యాలీ

- Advertisement -
- Advertisement -
కిషన్‌రెడ్డి- అడుగడుగునా ప్రజల నీరాజనం

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. 200 కిలోమీటర్ల పాటు బైక్ ర్యాలీలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తొమ్మిది గంటల పాటు జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా కేంద్ర మంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం ఉదయం పరేడ్ మైదానం వద్ద ఈ ర్యాలీని మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. త్రివర్ణ పతాకాలు, బిజెపి జెండాలతో ఈ ర్యాలీ పొడగునా రోడ్లన్నీ రంగులమయంగా మారాయి.

బైక్ యాత్ర హబ్సిగూడ, ఉప్పల్, ఘట్ కేసర్, భువనగిరి, ఆలేరు మీదుగా జనగాంలో మధ్యాహ్న భోజనం కోసం ఆగింది. భువనగిరిలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సీనియర్ నాయకుడు ఈశ్వర్ గుప్తాకు కిషన్ రెడ్డి పాదాభివందనం చేశారు. వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది. నిజాం ఉక్కుపిడికిలిలో నలిగిన హైదరాబాద్ సంస్థాన్ విముక్తి గాథ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ముఖ్యమైన ఘట్టమని దీన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. విమోచన దినోత్సవాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలనడం ద్వారా విముక్తి పోరాట వాస్తవ చరిత్రను మరుగు పరచాలనే బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ యాత్రలో రాష్ట్ర బిజెపి నేతల ఈటల రాజేందర్, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News