- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామికి కూడా కార్యాచరణ లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ… 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలన్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను బిజెపినే కైవసం చేసుకుంటుందని, దానిని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. సిఎం చర్చకు రమ్మనడం హాస్యాస్యపదంగా ఉందని, అసలు ఇంతకి దేనిపై చర్చించాలని ప్రశ్నించారు. హమీల వరకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని, దేనిపై చర్చకు రావాలో రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
- Advertisement -